Home / MOVIES / పవన్ -రానా కొత్త మూవీ టైటిల్ ఇదే..?

పవన్ -రానా కొత్త మూవీ టైటిల్ ఇదే..?

చానా రోజుల తర్వాత  రీ ఎంట్రీ ఇస్తున్న పవర్ స్టార్  పవన్‌కళ్యాణ్‌ స్పీడుగా సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే ‘వకీల్‌ సాబ్‌’ చిత్రీకరణను పూర్తి చేసిన పవన్‌కళ్యాణ్‌ ఇప్పడు రెండు సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్లారు. అందులో ఒకటి క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘హరిహర వీరమల్లు'(పరిశీలనలో ఉన్న టైటిల్‌) సినిమా ఒకటి.

దీంతో పాటు మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్‌ కోశియమ్‌’ రీమేక్‌లోనూ పవన్‌ నటిస్తున్నారు. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో రానా కూడా నటిస్తున్నారు.

తాజా సమాచారం మేరకు ఈ సినిమాకు ‘రుద్ర ప్రతాప్‌’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ఈ సినిమాలో పవన్‌ కల్యాణ్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా, రానా దగ్గుబాటి రైటర్డ్‌ మిలటరీ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.