మహానటి ఫేం కీర్తి సురేష్..తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్‌ను వివాహం చేసుకోనుందని కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. వీరిద్దరు కలిసి అన్యోన్యంగా దిగిన ఫొటోలను షేర్ చేస్తూ.. అతి త్వరలోనే కీర్తి , అనిరుధ్ వివాహం ఉంటుందని పుకార్లు పుట్టించారు. దీనిపై ఇటు అనిరుధ్ కాని, అటు కీర్తి కాని రియాక్ట్ కాలేదు.
కీర్తి- అనిరుధ్ వివాహం అంటూ కొన్నాళ్లుగా వస్తున్న వార్తలను వారి క్లోజ్ ఫ్రెండ్స్ ఖండించారు. చాన్నాళ్లుగా కీర్తి సురేష్, అనిరుధ్ మంచి స్నేహితులు. వారిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ రిలేషన్ ఉంది తప్ప వేరేదేమి లేదంటూ క్లారిటీ ఇచ్చారు.