Home / MOVIES / హిందీలోకి ఉప్పెన రీమేక్

హిందీలోకి ఉప్పెన రీమేక్

వైష్ణ‌వ్ తేజ్, కృతి శెట్టి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో బుచ్చిబాబు తెర‌కెక్కించిన చిత్రం ఉప్పెన‌. ఈ సినిమా సృష్టిస్తున్న రికార్డుల ప్ర‌భజ‌నం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్ల‌ర్లేదు. 70 కోట్ల‌కు పైగా గ్రాస్ వసూళ్లు రాబ‌ట్టిన ఈ చిత్రం మ‌రిన్ని రికార్డులు బ్రేక్ చేయడానికి సిద్ధంగా ఉంది.

అయితే ఈ సినిమాను ఇప్పుడు త‌మిళం, హిందీ భాష‌ల‌లో రీమేక్ చేయాల‌ని భావిస్తున్నారు. త‌మిళంలో విజ‌య్ త‌న‌యుడు సంజ‌య్ రీమేక్ చేయ‌నున్నాడ‌ని ఇటీవ‌ల వార్త‌లు రాగా, ఇప్పుడు హిందీలోను రీమేక్ కానున్న‌ట్టు తెలుస్తుంది.

బాలీవుడ్‌లో ఇషాన్ ఖట్టర్, అనన్య పాండే హీరో, హీరోయిన్లుగా ఉప్పెన రీమేక్ చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అతి త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రానుంద‌ని అంటున్నారు. మైత్రి మూవీమేక‌ర్స్, సుకుమార్ సంయుక్తంగా నిర్మించిన ఉప్పెన చిత్రాన్ని డెబ్యూ డెరెక్ట‌ర్ బుచ్చి బాబు తెర‌కెక్కించారు.