Home / ANDHRAPRADESH / ఏపీలో గాడిద మాంసానికి ఫుల్ డిమాండ్

ఏపీలో గాడిద మాంసానికి ఫుల్ డిమాండ్

ఏపీలో గాడిద మాంసానికి విపరీతమైన డిమాండ్ నడుస్తోంది. ఇది తింటే బలమని.. శృంగార సామర్థ్యం పెరుగుతుందని నమ్ముతున్నారు. దీంతో గాడిదలను అక్రమంగా వధించి మాంసాన్ని విక్రయిస్తున్నారు.

పక్క రాష్ట్రాల నుంచి తెచ్చి మరీ ఒక్కో గాడిదను రూ 5వేల వరకూ అమ్ముతున్నారు. గాడిదను తినే జంతువుగా ప్రభుత్వం గుర్తించలేదు. గాడిద వధ చట్ట ప్రకారం నేరం, కాగా ముఠాలుగా ఏర్పడి బహిరంగ మార్కెట్లోనే గాడిద మాంసం విక్రయిస్తున్నారు.