Home / SLIDER / తెలంగాణలో ఇక వారానికి ఒకసారి కరోనా కేసుల సమాచారం

తెలంగాణలో ఇక వారానికి ఒకసారి కరోనా కేసుల సమాచారం

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ గత ఏడాది మార్చి 8 నుంచి కరోనా కేసుల సమాచారాన్ని అందజేస్తుండగా.. మంగళవారం నుంచి సమాచారాన్ని నిలిపివేసినట్లు ప్రజారోగ్య సంచాలకుడు జి. శ్రీనివాసరావు తెలిపారు.

కొంత కాలంగా కరోనా ఉద్ధృతి తగ్గడం, కేసుల నమోదులో పెద్దగా మార్పులు లేకపోవడం వల్ల అధికారులను టీకా కార్యక్రమంలో ఉపయోగించుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఇక వారానికి ఒకసారి కరోనా కేసుల సమాచారాన్ని విడుదల చేస్తామన్నారు.