Home / MOVIES / నక్క తోక తొక్కిన కృతిశెట్టి

నక్క తోక తొక్కిన కృతిశెట్టి

ఉప్పెన మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేయడమే కాకుండా తెలుగు రాష్ట్రాల యువత మదిని కొల్లగొట్టిన భామ కృతిశెట్టి. తాజాగా ఈ ముద్దు గుమ్మ ఓ యువహీరో సరసన నటించడానికి అవకాశం దక్కించుకుందని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఎనర్జిటీక్ హీరో రామ్ పోతినేని-లింగుస్వామి కాంబినేషన్ లో త్వరలోనే ఓ సినిమా రానున్న సంగతి విదితమే. తెలుగు, తమిళంలో ఏకకాలంలో ప్లాన్ చేసిన ఈ చిత్రంలో హీరోయిన్ గా కృతి శెట్టి ఫిక్స్ అయినట్లు టాక్ వినిపిస్తోంది.

పలువురి పేర్లను పరిశీలించినా.. చివరకు కృతిశెట్టి పేరును ఫైనల్ చేశారట. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుండగా.. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై ఈ సినిమాను శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat