ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారనే ఆరోపణలతో పోలీసులు ఆయనపై కేసు ఫైల్ చేశారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి బంధువు గౌరీనాథ్ రెడ్డి ఇంట్లో పోలీసులు చేసిన దాడుల్లో 60 క్రికెట్ కిట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై మరింత లోతుగా విచారణ చేపట్టనున్నారు