రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫుల్ జోష్లో ఉన్నాడు. పూరీ జగన్నాథ్ ‘లైగర్’ తర్వాత.. తన తదుపరి చిత్రంలో క్యూట్ బ్యూటీ రష్మికతో మరోసారి విజయ్ జతకట్టనున్నాడట.
వీరిద్దరూ గతంలో గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించి క్రేజీ జంటగా యూత్ కి కనెక్ట్ అయిపోయారు. ప్రస్తుతం రష్మిక పుష్ప, మిషన్ మజ్నా చిత్రాల్లో నటిస్తోంది. వీటి తర్వాత విజయ్ తో ఆమె చిత్రం ఉండబోతుందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.