Home / MOVIES / లక్ అంటే మీనాదే గురు..?

లక్ అంటే మీనాదే గురు..?

ఆమె తన అందచందాలతో తెలుగు సినిమా ప్రేక్షకులను మైమరిపించిన ముద్దుగుమ్మ. సెకండ్ ఇన్నింగ్స్ లో ఈ ముద్దుగుమ్మ అమ్మ పాత్ర.. అత్త పాత్రలో నటిస్తూ అప్పటి తన అభినయం ఏమాత్రం తగ్గలేదు అని నిరూపించుకుంటుంది.

తకూ ఈ ముద్దుగుమ్మ ఎవరనుకుంటున్నారా.. ఆమెనే మీనా.. మీనాను చూస్తే మన ఇంట్లో పిల్ల లెక్క ఉంటది. అలాంటి పిల్ల ప్రస్తుతం మోహన్ లాల్ సరసన నటించిన దృశ్యం 2 హిట్ అవ్వడంతో బిజీబిజీగా ఉంది. తాజాగా ‘దృశ్యం 2’ తెలుగు రీమేక్‌లోనూ వెంక‌టేశ్‌తో జోడీ క‌ట్ట‌నుంది.మరోవైపు  కలెక్షన్ కింగ్ ,డైలాగ్ కింగ్ మోహాన్ బాబు సరసన నటించనున్నది అని సమాచారం.

మోహన్ బాబు టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘స‌న్నాఫ్ ఇండియా’. డైమండ్ ర‌త్న‌బాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇది వర‌కు వీర‌ద్ద‌రూ క‌లిసి ‘అల్ల‌రి మొగుడు, మామ మంచు అల్లుడు కంచు’ సినిమాల్లో జంట‌గా న‌టించారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్‌పై మోహన్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అంతేకాదు ఈ చిత్రానికి స్వయంగా స్క్రీన్ ప్లే కూడా అందిస్తున్నారు.