Home / MOVIES / ఉప్పెన జోడికి బంఫర్ ఆఫర్

ఉప్పెన జోడికి బంఫర్ ఆఫర్

బుచ్చిబాబు దర్శకత్వం వహించిన మొదటి చిత్రంతోనే తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రేక్షకుల మదిని కొల్లగొట్టిన జంట వైష్ణవ్ కృతిశెట్టి. ఈ చిత్రంలో వీరిద్దరి నటనకు ఫిదా కానీ వారు లేరంటే అతిశయోక్తి కాదేమో.. అంత బాగా నటించారు.వీరిద్దరూ హీరోహీరోయిన్లుగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన `ఉప్పెన` చిత్రం ఇటీవల విడుదలై సంచలన విజయం సాధించింది.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం కళ్లు చెదిరే రీతిలో కలెక్షన్లు సాధిస్తోంది. వంద కోట్ల రూపాయల కలెక్షన్లకు చేరువలో ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో హీరోహీరోయిన్లకు మైత్రీ నిర్మాణ సంస్థ నగదు బహుమతులు అందించిందట.

హీరో వైష్ణవ్‌ తేజ్‌కి కోటి రూపాయలు.. హీరోయిన్‌ కృతికి 25 లక్షల రూపాయలు ఇచ్చారని తెలుస్తోంది. కాగా, తొలుత ఈ సినిమా పారితోషికంగా వైష్ణవ్‌కు రూ.50 లక్షలు, కృతికి రూ.10 లక్షలు ఇచ్చినట్టు సమాచారం.

ఈ సినిమా విజయం కారణంగా అటు వైష్ణవ్, ఇటు కృతి వరుస అవకాశాలు అందుకుంటున్నారు. కాగా, ఈ సినిమా దర్శకుడు బుచ్చిబాబుకు కూడా కోటి రూపాయల విలువైన బహుమతిని మైత్రీ అధినేతలు ఇవ్వబోతున్నారని సమాచారం.