Home / SLIDER / షర్మిల పార్టీపై మంత్రి గంగుల సంచలన వ్యాఖ్యలు

షర్మిల పార్టీపై మంత్రి గంగుల సంచలన వ్యాఖ్యలు

కోట్లాడి తెచ్చుకున్న  తెలంగాణ రాష్ట్రంలో వేరే పార్టీలకు అవకాశం లేదని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుపై స్పందించిన ఆయన.. ’90శాతం తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ వెంటే ఉన్నారు.

టీఆర్ఎస్ ను తమ పార్టీగా ప్రజలు భావిస్తారు. తెలంగాణకు తండ్రిలాంటి కేసీఆర్ ఉండగా.. కోడలైన షర్మిల మా రాష్ట్రానికి అవసరం లేదు. టీఆర్ఎస్ ను ప్రజలు ఎప్పటికీ ఆదరిస్తారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ఆస్తి’ అని ఆయన అన్నారు