తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల ,మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీ రామారావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ షేక్ పేట్ తహసీల్దార్ కార్యాలయంలో పోలింగ్ కేంద్రంలోమంత్రి కేటీఆర్ ఓటేశారు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రులంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ‘సమస్యలను పరిష్కరించే అభ్యర్థికి ఓటేశాను. అభివృద్ధికి పాటుపడే అభ్యర్థికి మద్దతుగా నిలిచాను. విద్యావంతులంతా సమర్థులకే ఓటేయాలి. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రానికి వెళ్లాలి’ అని అన్నారు