ఏపీ మాజీ మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు సీఐడీ నోటీసులు ఇచ్చిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు ప్రాణహాని ఉందని, కేంద్రం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
చంద్రబాబును ఏదో రకంగా అంతమొందించాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. 150 మంది ఎమ్మెల్యేలున్నా జగన్ కు చంద్రబాబు ఫోబియా పట్టుకుందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో జగన్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు