Home / SLIDER / సచిన్ అభిమానులకు బ్యాడ్ న్యూస్

సచిన్ అభిమానులకు బ్యాడ్ న్యూస్

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కు కరోనా సోకింది. స్వల్ప లక్షణాలు ఉండటంతో ఇటీవల టెస్ట్’ చేయించుకోగా.. పాజిటివ్ వచ్చింది. దీనిపై సోషల్ మీడియాలో స్పందించారు సచిన్.

తన అధికారక ట్విట్టర్ ఖాతాలో  ‘నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇంట్లోని మిగతా సభ్యులకు నెగిటివ్ వచ్చింది ఇంట్లోనే క్వారంటైన్ లో ఉన్నాను. డాక్టర్లు చెప్పిన సూచనలు పాటిస్తున్నా. ఇటీవల నన్ను కలిసిన వారు టెస్టులు చేయించుకోండి’ అని ఓ పోస్ట్ పెట్టాడు.