తెలంగాణ రాష్ట్రంలో ఏఫ్రిల్ పదిహేడో తారీఖున జరగనున్న నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య తనయుడు నోముల భగత్ కుమార్ పేరును ఆ పార్టీ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేసి పార్టీ బీ ఫాం కూడా ఇచ్చారు.
నిన్న మంగళవారం మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి,సీనియర్ నేత ఎంసీ కోటిరెడ్డిలతో కల్సి భగత్ నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారికి సమర్పించిన అఫిడవిట్ లో తన ఆస్తి కేవలం 1.47కోట్లుగా భగత్ పేర్కొన్నారు.
అయితే తన భార్య భవాని పేరిట రూ.73లక్షలు ఉండగా భగత్ కు బ్యాంకుల్లో 24లక్షలు ,భార్య పేరిట రూ.60లక్షల అప్పు ఉందని భగత్ పేర్కొన్నారు. తాను వ్యవసాయంతో పాటుగా న్యాయవాది వృత్తిని చేస్తున్నట్లు,తన భార్య భవాని వ్యాపారం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు..