Home / MOVIES / అల వైకుంఠ‌పుర‌ములో మరో రికార్డు

అల వైకుంఠ‌పుర‌ములో మరో రికార్డు

టాలీవుడ్ కి చెందిన మాట‌ల మాంత్రికుడు,స్టార్ దర్శకుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే ప్ర‌ధాన పాత్ర‌లుగా రూపొందిన చిత్రం అల వైకుంఠ‌పుర‌ములో.

గ‌త ఏడాది సంక్రాంతి కానుక‌గా విడుద‌లై బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ చిత్రం మ్యూజిక‌ల్‌గాను పెద్ద హిట్ కొట్టింది. థ‌మ‌న్ స్వ‌ర‌ప‌ర‌చిన బాణీలు సంగీత ప్రియుల‌ని ఎంత‌గానో అల‌రించాయి. కేవ‌లం మ‌న దేశంలోనే కాదు విదేశాల‌లోను ఈ సినిమా సాంగ్స్‌కు అదిరిపోయే క్రేజ్ వ‌చ్చింది.

తెలుగు సినిమాలో ఇప్పటి వరకు ఏ సినిమా ఆల్బమ్ కు రాని స్పందన అల వైకుంఠపురములో ఆల్బమ్ కు రాగా, ఈ ఆల్బ‌మ్ ఇప్పుడు 2 బిలియ‌న్ వ్యూస్ మార్క్‌ను క్రాస్ చేసి ద‌క్షిణాది సినిమాలో ఫ‌స్ట్ ఎవ‌ర్ రికార్డ్ సెట్ చేసిన‌ట్టు స‌మాచారం. ఇప్ప‌టికే అనేక రికార్డులు సృష్టించిన అల వైకుంఠ‌పుర‌ములో తాజాగా ఈ రికార్డ్ సాధించ‌డం ప‌ట్ల ఫ్యాన్స్ సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.