Home / HYDERBAAD / టీఆర్ఎస్ సీనియర్ నేత మృతి

టీఆర్ఎస్ సీనియర్ నేత మృతి

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ముషీరాబాద్‌ టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, హెచ్‌ఎంఎస్‌ కార్మిక సంఘం నాయకుడు బల్లవీరస్వామి(75) అనారోగ్యంతో తన నివాసంలో ఆదివారం మృతి చెందాడు.

ఈ విషయం తెలుసుకున్న ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, కార్పొరేటర్‌ సుప్రియానవీన్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ యువజన విభాగం నగర నాయకుడు ముఠా జైసింహ, డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు సయ్యద్‌ అహ్మద్‌ భక్తియార్‌, నాయకులు వీరస్వామి భౌతికకాయం వద్ద నివాళులర్పించారు.

వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వీరస్వామి కుమారుడు బల్ల ప్రశాంత్‌ను పరామర్శించారు. ఆదివారం మధ్యాహ్నం వీరస్వామి అంత్యక్రియలు ముషీరాబాద్‌ బాపూజీనగర్‌లో నిర్వహించారు.