Home / LIFE STYLE / కరోనా నుంచి కోలుకున్న వారు వెంటనే వ్యాక్సిన్ తీసుకోవచ్చా..?

కరోనా నుంచి కోలుకున్న వారు వెంటనే వ్యాక్సిన్ తీసుకోవచ్చా..?

ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెల్సిందే. అయితే కరోనా నుంచి కోలుకున్న వారు వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు. పాజిటివ్ వచ్చి కోలుకున్న అనంతరం 90 రోజుల వరకు టీకా అవసరం లేదు.

ఆ తర్వాత వేయించుకోవాలని WHO, అమెరికా CDCA సూచించాయి. కరోనా నుంచి కోలుకోగానే యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయని, 3 నెలల వరకు మళ్లీ వైరస్ వచ్చే అవకాశం తక్కువేనని చెప్పారు. అప్పటి వరకు మాస్కు, శానిటైజర్, భౌతిక దూరం లాంటి నిబంధనలు పాటించాలన్నారు.