కాంగ్రేస్ ఓబీసీ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ వరంగల్ జిల్లా ఓబీసి ఇంచార్జ్ కూరతోట సదానందం వారి అనుచరులతో కలిసి ఈ రోజు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు..ఈ మేరకు అతనికి శివనగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు..
టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమాభివృద్ది కార్యక్రమాలను చేపడుతుందని,ప్రభుత్వం,ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపడుతున్న కార్యక్రమాలకు ఆకర్శితులై టీఆర్ఎస్ లో కి కూరతోట సదానందం వారి అనుచరులు చేరటాన్ని స్వాగతిస్తున్నామని ఎమ్మెల్యే నరేందర్ అన్నారు..
వరంగల్ అభివృద్ది టీఆర్ఎస్ తోనే సాద్యమన్నారు..టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు..ఈ కార్యక్రమంలో 27 వ డివిజన్ అభ్యర్థి జారతి రమేష్ బాబు,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ టీ.రమేష్ బాబు,ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు..