Home / SLIDER / విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్

విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ అయింది. జింబాబ్వేతో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్ ను పాకిస్థాన్ జట్టు 2-1తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్ లో భాగంగా చివరదైన మూడో టీ20లో పాకిస్థాన్ జింబాబ్వే జట్టుపై ఇరవై నాలుగు పరుగుల తేడాతో గెలుపొందింది.

అయితే మొదట మహ్మద్ రిజ్వాన్ (91*),కెప్టెన్ బాబర్ ఆజమ్ (52)రాణించడంతో పాకిస్థాన్ మొత్తం ఇరవై ఓవర్లను పూర్తి చేసి మూడు వికెట్లకు 165 పరుగులను మాత్రమే చేసింది.

తర్వాత బ్యాటింగ్ కు దిగిన ప్రత్యర్థి జట్టు అయిన జింబాబ్వే లక్ష్య చేధనలో ఏడు వికెట్లను కోల్పోయి ఇరవై ఓవర్లలో 141 పరుగులు మాత్రమే చేసింది. అయిటే అజమ్ ఆర్ధశతకం సాధించడంతో టీ20లో కేవల  యాబై రెండు ఇన్నింగ్స్ లో అత్యంత వేగంగా రెండు వేల పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డుకెక్కాడు. అప్పటి వరకు విరాట్ కోహ్లీ పేరు మీద ఉన్న (56 ఇన్నింగ్స్)రికార్డును అజమ్ బ్రేక్ చేశాడు.