తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో అక్కినేని నాగచైతన్య.. తొలిసారి వెబ్ సిరీస్లో ముందుకు రానున్నాడు. చైతూ లీడ్ రోల్లో అమెజాన్ ప్రైమ్ సరికొత్త సిరీస్ రూపొందిస్తోంది. నాగచైతన్య.. తన OTT ఎంట్రీ యాక్షన్ థ్రిల్లర్తో చేయనున్నాడు.
విక్రమ్ కె కుమార్.. ఈ సిరీసు దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. జులైలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చైతూతో పాటు రాధిక ఆప్టే, అతుల్ కులకర్ణి లాంటి పాన్ ఇండియా యాక్టర్స్ నటిస్తారని టాక్.