దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత వరుసగా మూడో రోజు కూడా పెట్రో ధరలు పెరిగాయి. ఢిల్లీలో గురువారం లీటర్ పెట్రోలుపై 25 పైసలు, డీజిల్పై 30 పైసలను చమురు సంస్థలు పెంచాయి.
ఇక హైదరాబాద్లో లీటరు పెట్రోలుపై 23 పైసలు పెరగగా.. రూ.94.57కు చేరింది. డీజిల్ ధర లీటరుకు 31 పైసలు పెరగగా.. రూ. 88.77కు ఎగబాకింది.