ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ప్రాణానికి ముప్పు ఉందంటూ వచ్చిన ఫోన్ కాల్ కలకలం రేపింది. కొద్దిరోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టాటా ప్రాణానికి ముప్పు ఉందని, భద్రత పెంచకపోతే సైరస్ మిస్త్రీలాగే అవుతుందని ఓ వ్యక్తి ముంబై పోలీస్ కంట్రోల్ రూంకి కాల్ చేసి హెచ్చరించాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడి మానసిక పరిస్థితి సరిగా లేనట్లు తెలిపారు.
Read More »వారంలో రెండు రోజులు సెలవులు
దేశంలో బ్యాంకులకు 5 రోజుల పనిదినాలు, రెండు రోజులు సెలవులు ఉండేలా కేంద్రానికి ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్(IBA) ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. అయితే బ్యాంకులలో పని చేసే ఉద్యోగులు రోజూ 40 నిమిషాలు అదనంగా పనిచేయాలని సూచించింది. దీనిపై ఈనెల 28న బ్యాంకు యూనియన్లతో సమావేశమై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా, ఇటీవల LIC ఉద్యోగులకు 5 రోజుల పనిదినాలు ప్రకటించిన విషయం తెలిసిందే.
Read More »స్టాక్ మార్కెట్ లో సంచలన రికార్డు
ఈరోజు మంగళవారం ఉదయం ప్రారంభమైన స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో MRF కంపెనీ చరిత్ర సృష్టించింది. ఆ కంపెనీకి చెందిన షేర్లు రూ.లక్ష మార్కును అందుకుంది.. అయితే ఈ ఘనత అందుకున్న ఏకైక భారతీయ కంపెనీగా MRF నిలిచింది. 2002లో ఈ సంస్థ షేర్ ధర రూ.1000గా ఉండగా, 2021 జనవరి 20 నాటికి రూ.90వేలకు చేరింది. ఇవాల్టి ట్రేడింగ్లో రూ.లక్ష మార్కును దాటి ఆల్ టైం హై గా …
Read More »స్వల్ప లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. సెనెక్స్ 74.61 పాయింట్ల లాభంతో 60,130.71 పాయింట్ల వద్ద ముగిసింది. మరో వైపు నిఫ్టీ 25.85 పాయింట్ల లాభంతో 17,769.25 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన మిశ్రమ సానుకూల పవనాలు, కంపెనీల త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించడంతో సూచీలు ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయి. ఉదయం సెన్సెక్స్ 60,202 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఆ తర్వాత …
Read More »లావోరాలో పెట్టుబడులు ..ఆదాయం పదింతల రెట్టింపు
తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగంలో తిరుగులేని రారాజు..నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం..రియల్ ఎస్టేట్ లోనే అత్యధికంగా ల్యాండ్ బ్యాంకు ఉన్న సంస్థ లావోరా.. దాదాపు ఇరవైకి పైగా ప్రాజెక్టులతో సుమారు రెండు వేల ఐదోందల ఎకరాలను లావోరా సంస్థ కస్టమర్లకు వినియోగదారులకు అందుబాటులోకి తీసుకోచ్చింది లావోరా సంస్థ. అన్ని రకాల హెచ్ఎండీఏ అనుమతులు..డీటీసీపీ,ముడా మరియు ఫాం ల్యాండ్స్ ను కలిగి ఉన్న ఏకైక రియల్ ఎస్టేట్ సంస్థ లావోరా..అత్యంత వేగంగా …
Read More »నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
ఈ వారాంతంలో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 141 పాయింట్ల నష్టంతో 59,463 వద్ద ముగిసింది. నిఫ్టీ 45 పాయింట్ల నష్టంతో 17,465 వద్ద స్థిరపడింది. రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సెర్వ్, అదానీ పోర్ట్స్, ఏషియన్ పెయింట్స్ కంపెనీల షేర్లు లాభాలు ఆర్జించాయి.. అదానీ ఎంటర్ప్రైజెస్, HDFC బ్యాంక్, M&M, JSW స్టీల్ కంపెనీలు నష్టాలను చవిచూశాయి.
Read More »స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
దేశ వ్యాప్తంగా స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గి రూ. 47,800గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గి రూ. 52,150గా ఉంది. వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. కిలో వెండి ధర రూ.400 తగ్గి రూ.62 వేలుగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
Read More »అదానీ సంచలన నిర్ణయం
టెలికాం సేవల్లోకి ప్రవేశించేందుకు అదానీ గ్రూప్ రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈనెల 26 నుంచి జరగనున్న స్పెక్ట్రమ్ వేలంలో పొల్గొనేందుకు అదానీ గ్రూప్ దరఖాస్తు చేసుకోవడం ఈ విషయాన్ని నిర్థారిస్తోంది. రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాతో పాటు అదానీ గ్రూప్ కూడా దరఖాస్తు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే ఈ విషయమై అదానీ గ్రూప్ ఎలాంటి ప్రకటన చేయలేదు.
Read More »సరికొత్త వ్యాపారంలోకి ముఖేష్ అంబానీ
భారతదేశ వాణిజ్య రంగాన్నే శాసిస్తున్న ప్రముఖ బడా పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ మరో సరికొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఫుడ్, డ్రింక్స్ బిజినెస్ లోకి అడుగుపెట్టినట్లు రిలయన్స్ బ్రాండ్స్ ప్రకటించింది. బ్రిటన్ దేశానికి చెందిన ఫ్రెష్ ఫుడ్, ఆర్గానిక్ కాఫీ సంస్థ ‘ప్రెట్ ఏ మ్యాంగర్’తో లాంగ్ టర్మ్ మాస్టర్ ఫ్రాంఛైజీ భాగస్వామ్యాన్ని రిలయన్స్ బ్రాండ్స్ కుదుర్చుకుంది. దేశవ్యాప్తంగా బ్రాంచీలు ఏర్పాటు చేయనుంది. ముందుగా దేశంలో …
Read More »యూజర్లకు ఎయిర్టెల్ షాక్
తమ యూజర్లకు ఎయిర్టెల్ షాక్ ఇవ్వనుంది. ఇప్పటికే గతేడాది టారిఫ్ రేట్లను పెంచిన సంస్థ.. మరోసారి పెంచేందుకు సిద్ధమవుతోంది. దీంతో సగటు యూజర్ పై వచ్చే ఆదాయం రూ.200 మార్కును దాటాలని ఎయిర్టెల్ భావిస్తోంది. గతేడాది మార్చిలో రూ. 145తో పోలిస్తే ఈసారి మార్చి నాటికి రూ. 178కి పెంచుకుంది. దీన్ని ఇప్పుడు రూ.200కు పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఫలితంగా టారిఫ్ పెంచనున్నట్లు ప్రకటించింది.
Read More »