తమిళనాడు 14వ ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ స్టాలిన్‌తో ప్రమాణం చేయించారు. మరో 34 మంది మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు.
కరుణానిధి మంత్రివర్గంలో పని చేసిన వారికి స్టాలిన్ అవకాశమిచ్చారు. మంత్రివర్గంలో ఇద్దరు మహిళలు, ఇద్దరు మైనార్టీలకు స్థానం దక్కింది. ఇటీవల ఎన్నికల్లో 234 స్థానాలకు గానూ డీఎంకే 133 సీట్లు గెలిచి, విజయం సాధించింది.