ఏపీ అధికార వైసీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి జగన్, మంత్రుల భద్రత మరింత పెరగనుంది. రూ.6 కోట్ల 75 లక్షలతో ఏపీ సర్కారు 10 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కొనుగోలు చేయనుంది.
టయోటా ఫార్చూనర్ వాహనాలు ఒక్కోటి రూ.34.10 లక్షలకు కొనుగోలు చేయనున్నారు. వాటిని బుల్లెట్ ప్రూఫ్గా మార్చేందుకు మరో రూ.33.40 లక్షలు ఖర్చు పెట్టనున్నారు. వీటిని సీఎం, మంత్రులు, వీవీఐపీలు, సీనియర్ పోలీసు అధికారులు వినియోగించనున్నారు.