ఏపీ అధికార పార్టీ అయిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయనను వైద్య పరీక్షల నిమిత్తం సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి తరలించాలని ఆదేశించింది.
వైద్య పరీక్షల పర్యవేక్షణకు జ్యూడీషియల్ అధికారిని నియమించాలని సూచించింది.
వైద్య పరీక్షలను వీడియో రికార్డింగ్ చేసి నివేదికలను సీల్డ్ కవర్లో ఇవ్వాలని పేర్కొంది. రఘురామ బెయిల్ పిటిషన్ను శుక్రవారానికి వాయిదా వేసింది.