గతంలో తన కుమార్తెకు టిబి సోకినప్పుడు మెగాస్టార్ చిరంజీవి రెండు లక్షలు ఇచ్చారని, ఇప్పుడు ‘మా’ (MAA) సభ్యత్వం కోసం లక్ష రూపాయలు పంపించారని, తాను బతికినంత కాలం ఆయనకు ఋణపడి ఉంటానని నటి పావలా శ్యామల కృతఙ్ఞతలు తెలిపారు.
నటి పావలా శ్యామల దీన స్థితిని చిత్రజ్యోతి రెండు రోజులుగా తెలుపుతున్న విషయం తెలిసిందే. దాతలు ఆమెను ఆదుకోవాలని, ఆమె ఫోన్ నెంబర్ కూడా ప్రకటించడం జరిగింది.
ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ముందుకు వచ్చి.. ఆమెకు రూ. 1,01,500 (1లక్షా 1500)లతో ‘మా’ సభ్యత్వం ఇప్పించి, ఆమెకు ప్రతి నెలా ఆరు వేల రూపాయల పెన్షన్ వచ్చేలా ఏర్పాటు చేయడంతో.. శ్యామల తన సంతోషాన్ని వెలిబుచ్చారు