కరోనా సెకండ్ వేవ్ ఉదృతి పెరుగుతుండడం, రానున్న రోజులలో థర్డ్ వేవ్ ముప్పు ఉన్న నేపథ్యంలో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా వ్యాక్సిన్ వేసుకునేందుకు క్యూలు కడుతున్నారు.
ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు వ్యాక్సిన్ తీసుకోగా, తాజాగా యంగ్ హీరోయిన్ ఐశ్వర్యరాజేష్ కరోనా వాక్సిన్ వేయించుకుని వార్తల్లో నిలిచింది .
తొలి డోస్ తీసుకున్న ఐశ్వర్య ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌ని విధిగా వేసుకోవాలంటూ కోరింది ఐశ్వర్య.
ఈ అమ్మడు ప్రస్తుతం ఐశ్వర్య తెలుగులో టక్ జగదీష్ ,పవన్ కళ్యాణ్ -రానా కాంబినేషన్ లోని అయ్యప్పనుమ్ కోషియం సినిమాలు చేస్తోంది. ఇందులో టక్ జగదీష్ ఆల్రెడీ విడుదలకు సిద్ధం అయింది. మెగామేనల్లుడు సాయిధరమ్ తేజ్ సరసన రిపబ్లిక్ సినిమాలో నటించింది.