తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ ఇలా ఏరువాకలో భాగంగా నాగలి పట్టుకుని పోలం దున్నారో లేదో కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరుణుడు దీవిస్తున్నట్లుగా వర్షం కురుస్తుంది. దీంతో రైతన్నలు ఆనందోత్సవాలతో వ్యవసాయ పనులకు సిద్ధమవుతున్నారు.. అసలు విషయానికోస్తే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బుధవారం ఎద్దుల అరకతో మంచుకొండలో ఏరువాక సాగారు.
అనంతరం రైతులకు పచ్చిరొట్ట విత్తనా లను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆధునిక వ్యవసాయ పద్ధ తులతో సాగు చేపట్టి అధిక దిగుబడులు సాధిం చాలని రైతులకు సూచించారు. జీలుగులు, పిల్లి పెసర, జనుము వంటి పైర్ల పచ్చిరొట్టను భూమిలో కలియదున్నడంవల్ల నేల సారవంతమ వుతుందన్నారు. రసాయనిక ఎరువుల అధిక విని యోగంతో భూసారం దెబ్బతింటుందన్నారు.
జిల్లాలో పచ్చిరొట్ట విత్తనాలను అందుబాటులో ఉంచామని, రైతులు సద్వినియోగం చేసుకోవాల న్నారు. వ్యవసాయ రంగాన్ని అన్ని విధాలా బలో పేతం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బంధు, రైతుబీమా, నిరంతర విద్యుత్తు సరఫరా, సకాలంలో విత్తనాలు, ఎరువులు అందించడం వంటి కార్యక్రమాలు చేపట్టారన్నారు. నకిలీ విత్త నాల విక్రయదారులపై ఉక్కుపాదం మోపుతామని మంత్రి హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్జన్ మాట్లాడుతూ జిల్లాలో సహకార సంఘాల ద్వారా పచ్చిరొట్టు విత్తనాలను 65 శాతం రాయి తీపై అందిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని, జడ్పీ చైర్మన్ కమల్రాజు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల, రైబస జిల్లా అధ్యక్షుడు నల్లమల, అదనపు కలె క్టర్ మధుసూదన్, డీసీసీబీ చైర్మన్ నాగభూ షయ్య, డీసీఎంఎస్ చైర్మన్ శేషగిరిరావు, ఎంపీపీ గౌరి, జడ్పీటీసీ సభ్యురాలు ప్రియాంక, సర్పంచి విజయ, డీఏవో విజయనిర్మల, ఆర్డీవో రవీంద్రనాథ్, ఎం. సుధాకర్ పాల్గొన్నారు.