Home / MOVIES / ఉపాసన నిర్మాతగా రామ్ చరణ్ మూవీ

ఉపాసన నిర్మాతగా రామ్ చరణ్ మూవీ

మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌- ఉపాస‌న ఈ జంట చాలా చూడ‌ముచ్చ‌ట‌గా ఉంటుంది. ఎప్పుడు ఎక్క‌డ క‌నిపించిన కూడా చాలా అన్యోన్యంగా ఉంటారు. చ‌ర‌ణ్ త‌న సినిమాల‌తో బిజీగా ఉంటుండ‌గా, ఉపాస‌న‌..అపోలో లైఫ్ వైస్ చైర్ పర్సన్‌గా, బీ పాజిటివ్ మ్యాగజైన్ చీఫ్ ఎడిటర్ గా ఉంటూనే.. ఫ్యామిలీ బాధ్యతలు చూసుకుంటుంది.

అలానే యువర్ లైఫ్ వెబ్ పోర్టల్ ద్వారా ప్ర‌జ‌ల‌లో ఆరోగ్యంపై అవ‌గాహ‌న పెంచే ప్ర‌య‌త్నం చేస్తుంది.క‌రోనా స‌మ‌యంలో వైద్యులు ప్రాణాల‌ను లెక్క చేయ‌కుండా ప్ర‌జ‌ల‌కు సేవ‌లు చేస్తున్నారు. వారి త్యాగాన్ని అంద‌రికి తెలియ‌జేయాల‌ని భావించిన ఉపాస‌న వారిపై ఓ షార్ట్ ఫిలిం చేయాల‌ని భావించింద‌ట‌. ఇందులో యువ హీరో శ‌ర్వానంద్ లేదంటే త‌న భ‌ర్త రామ్‌చ‌ర‌ణ్‌ని హీరోగా తీసుకోవాల‌ని అనుకుంటుంద‌ట‌.

ఇద్ద‌రితో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న ఉప్సీ త్వ‌ర‌లోనే దీనిపై ఓ క్లారిటీ ఇవ్వనుంది. ప్ర‌స్తుతం శ‌ర్వానంద్ .. ‘మహాసముద్రం’ అనే యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నాడు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న‌ ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ అనే చిత్రం చేస్తున్నాడు. రామ్ చ‌ర‌ణ్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో పాటు శంక‌ర్ మూవీతో బిజీగా ఉన్నాడు.