Breaking News
Home / MOVIES / కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఈ దర్శకుడు ఎవరో తెలుసా..?

కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఈ దర్శకుడు ఎవరో తెలుసా..?

 దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ మహమ్మారి అంతానికి టీకానే విరుగుడు కావడంతో చాలా మంది వ్యాక్సీన్‌ తీసుకుంటున్నారు.

ఇప్పటికే ఎంతో మంది సినీ, క్రీడా ప్రముఖులు టీకా వేసుకుంటున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు, ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ కూడా కరోనా టీకా తీసుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశాడు.

‘మొత్తానికి నేను కరోనా వ్యాక్సీన్‌ తీసుకున్నాను. మీరు కూడా స్లాట్‌ బుక్‌ చేసుకొని మీ ఫ్యామిలీతో సహా వ్యాక్సీన్‌ తీసుకోండి’అని విజ్ఞప్తి చేశారు.