పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ గారు, తెరాస ప్రభుత్వం పనిచేస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు అన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని వరంగల్, ఖిలా వరంగల్, కాజిపేట, హన్మకొండ మండలాలకు చెందిన 44మంది లబ్ధిదారులకు 16లక్షల 53వేల విలువగల చెక్కులను హన్మకొండ హంటర్ రోడ్డులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తోందని అన్నారు. ఆరోగ్య శ్రీ లో వర్తించని వ్యాధులకు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదల వైద్యానికి అయ్యే ఖర్చులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వైద్య చికిత్సకు తగిన ఆర్థిక సాయం బాధితులకు అందిస్తోందని అన్నారు.
ముఖ్య మంత్రి సహాయ నిధి ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.