Home / SLIDER / చిన్ననాటి ఫొటో పంచుకున్న మంత్రి కేటీఆర్‌

చిన్ననాటి ఫొటో పంచుకున్న మంత్రి కేటీఆర్‌

సామాజిక మాధ్యమాల వేదికగా తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ఎంత చురుగ్గా ఉంటారో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ట్విటర్‌ వేదికగా అభిమానులు, ప్రజలు అడిగే పలు ప్రశ్నలకు సమాధానం ఇవ్వడమే కాదు, సమస్యలను సైతం పరిష్కరిస్తూ ఉంటారు.

ఇక అప్పుడప్పుడు తన వ్యక్తిగత/కుటుంబ ఫొటోలను సైతం పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆయన ట్విటర్‌లో షేర్‌ చేసిన ఫొటో అందరినీ ఆకర్షిస్తోంది. 1984లో నాలుగో తరగతి సందర్భంగా ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులతో కలిసి దిగిన ఫొటోను స్నేహితుడు పంపగా దాన్ని అభిమానులతో పంచుకున్నారు.
‘‘1984 నాటి ఫొటో.

భరత్‌ అనే నా క్లాస్‌మేట్‌ ఈ ఫొటోను నిన్న నాకు పంపాడు. కరీంనగర్‌లోని సెయింట్‌ జోసెఫ్‌ పబ్లిక్‌ స్కూల్‌ నాలుగో తరగతి చదువుతున్నప్పటి ఫొటో ఇది. ఈ ఫొటోలోని ఉన్న అందరి పేర్లు మళ్లీ గుర్తు చేసుకున్నా. మీకు ఆశ్చర్యమనిపించినా ఇది నిజం’’ అని కేటీఆర్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల వేదికగా ట్రెండింగ్‌లో ఉంది.