తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 4న రాజన్న సిరిసిల్లకు రానున్నారు.దీంతో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది సిరిసిల్లలో నిర్మించిన జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ఆయన ప్రారంభించనున్నారు.
డబుల్ బెడ్‌రూం ఇళ్ల సముదాయంతోపాటు ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిని ప్రారంభిస్తారు. పల్లె ప్రగతి పనులను కూడా సీఎం తనిఖీ చేసే అవకాశాలు ఉన్నాయి. కేసీఆర్ తన అత్తగారి ఊరైనా బోయినపల్లి మండలం కొదురుపాకలో పల్లె నిద్ర చేయనున్నారు..