Home / MOVIES / విజయ్ దేవరకొండ సరసన అనుష్క

విజయ్ దేవరకొండ సరసన అనుష్క

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటి..అందాల ముద్దుగుమ్మ అయిన స్వీటీ అనుష్క శెట్టి టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిన‌ప్ప‌టికీ వ‌రుస సినిమాలు చేయ‌డం లేదు. ఆచితూచి అడుగులు వేస్తుంది.

ఎక్కువ‌గా లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్న అనుష్క చివ‌రిగా నిశ్శ‌బ్ధం అనే చిత్రంతో పల‌క‌రించింది. ఇందులో మాధవ‌న్ కూడా ముఖ్య పాత్ర పోషించాడు. కమర్షియల్‌ పంథాకు ప‌క్క‌న పెట్టి భిన్నమైన కథలను ఎంచుకునే పనిలో ఉన్న జేజమ్మ త‌న త‌దుప‌రి సినిమాను ప్రేమ క‌థా నేప‌థ్యంలో ఉండేలా చూసుకుంటుంద‌ట‌.

యూవీ క్రియేష‌నన్స్ నిర్మాణంలో రూపొంద‌నున్న ఈ చిత్రంకు ‘రా రా కృష్ణయ్య’ సినిమా దర్శకుడు మహేశ్ దర్శకత్వం వహిస్తున్నాడని 25 ఏళ్ల యువకుడికి, 40 ఏళ్ల మహిళకు మధ్య సాగే ప్రేమకథ నేప‌థ్యంలో ఉంటుంద‌ని స‌మాచారం.

చిత్రంలో జాతిరత్నాలు చిత్రంతో మంచి హిట్ కొట్టిన న‌వీన్ పోలిశెట్టి కూడా ముఖ్య పాత్ర పోషించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. తాజాగా రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా ఈ సినిమాలో న‌టించ‌నున్న‌ట్టు వినిపిస్తున్నాయి