రానున్న దసరా వరకు సిరిసిల్ల- వేములవాడలో అందరికీ రూపాయికే నల్లా కనెక్షన్ విధానంలో తాగునీరు అందిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పటికే దీనికోసం 60శాతం పనులు పూర్తి చేశామన్నారు.
స్థానిక మార్కెట్ నిర్మాణం కోసం రూ.5కోట్లు మంజూరు చేశామన్నారు. కమ్యూనిటీ మహిళా భవనానికి రూ. 20లక్షలు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.ప్రజలంతా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పారిశుద్ధ్య నిర్వహణపై అవగాహన పెంచుకోవాలన్నారు..