Home / MOVIES / Super Star సరసన బాలీవుడ్ బ్యూటీ

Super Star సరసన బాలీవుడ్ బ్యూటీ

సూప‌ర్‌స్టార్ రజినీకాంత్ త‌న తాజా చిత్రం ‘అణ్ణాత్త‌’ను పూర్తి చేసే ప‌నిలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా త‌ర్వాత త‌లైవా ఏ సినిమా చేస్తార‌నే దానిపై అధికారిక ప్ర‌క‌ట‌న లేదు. సౌంద‌ర్య ర‌జినీకాంత్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తారంటూ, కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేసే అవ‌కాశం ఉందంటూ.. ఇలా ప‌లు వార్త‌లు వినిపించాయి.

కాగా..లేటెస్ట్‌గా ర‌జినీ త‌దుప‌రి సినిమాపై ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అదేంటంటే.. దుల్క‌ర్ స‌ల్మాన్‌, రీతూవ‌ర్మ‌ల‌తో ‘క‌నులు క‌నుల‌ను దోచాయంటే’ అనే సినిమా చేసిన ద‌ర్శ‌కుడు దేసింగు పెరియ‌సామి ద‌ర్శ‌క‌త్వంలో సూప‌ర్‌స్టార్ త‌దుప‌రి సినిమా ఉంటుందట‌.

ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకొనెను తీసుకోవాల‌నుకుంటున్నార‌ని కూడా న్యూస్ చ‌క్క‌ర్లు కొడుతుంది. ఇంతకు ముందు ‘కొచ్చడయాన్’లో ర‌జినీకాంత్ జోడీగా దీపికా ప‌దుకొనె న‌టించిన సంగ‌తి తెలిసిందే.

ఇప్పుడు ఈ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మ‌రోసారి ర‌జినీకాంత్ జోడీగా న‌ట‌స్తుందా లేదా? ఇందులో నిజానిజాలేంటో తెలియాలంటే కొన్నాళ్లు ఆగ‌క త‌ప్ప‌దు మ‌రి. 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat