Home / MOVIES / బండ్ల గ‌ణేష్ దాతృత్వానికి నెటిజన్లు ఫిదా

బండ్ల గ‌ణేష్ దాతృత్వానికి నెటిజన్లు ఫిదా

ఎప్పుడు వివాదాల‌తో వార్త‌ల‌లో నిలిచే బండ్ల గ‌ణేష్ ఈ మ‌ధ్య సేవా కార్య‌క్ర‌మాల‌తో హాట్ టాపిక్ అవుతున్నారు. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్న బండ్ల గ‌ణేష్‌కు ప‌లువురు నెటిజ‌న్స్ రిక్వెస్ట్‌లు పెడుతున్నారు. ఆర్ధికంగా చితికిపోయిన వారు ఆదుకోవాల‌ని కోరుతుండ‌గా, బండ్ల వెంట‌నే స్పందిస్తూ త‌న వంతు సాయం చేస్తున్నారు.

ఇటీవల ఓ నెటిజ‌న్.. త‌న‌ అన్నయ్య బండ్ల లింగయ్యకు ఆటో ప్రమాదం జరిగిందని, ఆపరేషన్ చేసి 48 కుట్లు వేశారు, 6నెలల వరకు డాక్టర్లు ఇంట్లోనే ఉండమన్నారని చెప్పారు. ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంది. ఎవరూ స్పందించడం లేదు. మీరైనా కొంచెం ఆదుకోండా గణేష్‌ అన్నా. ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు’ అంటూ బండ్ల గణేష్‌ను సంప్రదించాడు. వెంట‌నే దీనికి స్పందించిన బండ్ల .. గూగుల్‌ పే నెంబర్‌ పంపించమని సదరు వ్యక్తిని కోరాడు

ఇక తాజాగా మ‌రో నెటిజ‌న్.. తన తల్లి బ్రెస్ట్‌ క్యాన్సర్‌తో బాధపడుతుందని, వైద్యానికి ఇరవై లక్షలు ఖర్చు అవుతుందని తెలియజేస్తూ, వీలైన సాయం చేయాల్సిందిగా అభ్యర్థించాడు. దీనిపై బండ్ల గణేశ్‌ స్పందిస్తూ.. మీ గూగుల్ పే నెంబ‌ర్ ఇవ్వండి, మ‌నం ఆ దేవుడు ఆశీస్సుల‌తో మీ అమ్మ‌గారిని కాపాడేందుకు ప్ర‌య‌త్నిద్ధాం అని తెలిపారు. బండ్ల గ‌ణేష్ చూపిస్తున్న‌దాతృత్వంపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat