Home / SLIDER / చేనేత అందాలు.. మన సంస్కృతికి చిహ్నాలు…

చేనేత అందాలు.. మన సంస్కృతికి చిహ్నాలు…

జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేనేత మరియు జౌళి శాఖ అధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బాల భవనంలో సభ నిర్వహించారు..ఈ కార్యక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా జెడ్పి‌ చైర్ పర్సన్ శ్రీమతి సరిత తిరుపతయ్య గారు పాల్గొని మాట్లాడారు…జాతీయ చేనేత దినోత్సవ వేడుకలుజాతీయ చేనేత దినోత్సవం ఆగష్టు 7న దేశవ్యాప్తంగా ప్రతి ఏటా నిర్వహిస్తారు..

భారత స్వాతంత్ర్యోద్యమములో ప్రధాన భూమిక పోషించి,జాతీయ చేనేత దినోత్సవం స్వాతంత్య్ర సమపార్జనకు ఒక సాధనంగా నిలిచింది చేనేత. గాంధీజీ కూడా రాట్నంపై నూలు వడకడానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. అంతటి ప్రాధాన్యత కలిగిన చేనేతరంగానికి ఒకరోజు ఉండాలన్న ఉద్దేశ్యంతో జాతీయ చేనేత దినోత్సవంను ఏర్పాటుచేయడం జరిగిందని‌ జెడ్పి‌ చైర్ పర్సన్ అన్నారు..

చేనేత కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ తోడుగా ఉంటుందన్నారు..త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం నేతనకు..చేయూత పథకం తీసుకువస్తుందని తెలిపారు..అనంతరం చేనేత కార్మికులను సన్మానించారు..ఈ కార్యక్రమంలో కలెక్టర్ శృతి ఓఝా..జెడ్పి‌ కో- ఆప్షన్ సభ్యులు ఇషాక్..కౌన్సిలర్లు శ్రీమన్నారాయణ.. చేనేత కార్మికులు..అధికారులు పాల్గొన్నారు..