Home / SLIDER / దళిత బంధు ఆవిష్కరణ కార్యక్రమ ఏర్పాట్లపై మంత్రులు సమీక్ష

దళిత బంధు ఆవిష్కరణ కార్యక్రమ ఏర్పాట్లపై మంత్రులు సమీక్ష

కరీంనగర్ జిల్లా కేంద్రంగా దళిత బంధు ప‌థ‌కాన్ని ఈ నెల 16న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో కరీంనగర్ కలెక్టరేట్లో మంత్రులు కొప్పుల ఈశ్వ‌ర్, గంగుల క‌మ‌లాక‌ర్, కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి దళిత బంధు ఆవిష్కరణ కార్యక్రమ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. గొప్పగా ఆలోచించి దళితవర్గాల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దళితబంధు కార్యక్రమం దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇన్నేళ్లలో రాలేదన్నారు. ఈనెల 16న హుజురాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

దళితబంధు అమలుపై కేసీఆర్ అన్ని జిల్లాల కలెక్టర్లతో సంపూర్ణంగా చర్చించడమే కాక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారన్నారు. దళిత బందు పథకం అమ‌లులో ఎలాంటి పైరవీలకు ఆస్కారం లేదని కొప్పుల ఈశ్వర్ స్ప‌ష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, కలెక్టర్ కర్ణన్, అడిషనల్ కలెక్టర్ శ్యామ్ లాల్, పోలీస్ ఉన్నతాధికారులతో పాటు అన్ని ముఖ్య శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.