Home / SLIDER / చిత్తశుద్ధి ఉంటే హుజూరాబాద్‌కు రండి-ప్రతిపక్షాలకు మంత్రి కేటీఆర్ సవాల్

చిత్తశుద్ధి ఉంటే హుజూరాబాద్‌కు రండి-ప్రతిపక్షాలకు మంత్రి కేటీఆర్ సవాల్

సీఎం కేసీఆర్‌ ఏదిచేసినా ముందే అనుమానాలు వ్యక్తంచేస్తరు. బలహీనమైన గుండె ఉన్నవాళ్లు అవలీలగా ఢాం అని అడ్డంపడతరు. సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ఉద్యమాన్ని ప్రారంభించిననాడు, తెలంగాణ వస్తది అన్ననాడు కూడా ఇట్లానే పిచ్చిప్రేలాపనలు చేసినవాళ్లు ఎంతోమంది ఉన్నారు. ఈ రోజు దళితబంధు ప్రారంభిస్తే కూడా ఇట్లనే అంటున్నరు. ముందు నవ్వుతరు. వెకిలి మాటలు మాట్లడతరు.

అవమానిస్తరు. ఆఖరికి గెలిచాక పక్కకొచ్చి ఫొటో దిగి పోతరు. అట్లా మాట్లాడేవాళ్లకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే హుజూరాబాద్‌కు వచ్చి దళితబంధులో పాల్గొనండి. దళిత కుటుంబాలతో మీరుకూడా కూర్చొండి. రూ.10 లక్షలు ప్రభుత్వం ఇస్తున్నప్పుడు దానిని ఎట్లా ఇరవై చేయాలె.. ఇరవైని ముప్ఫై చేయాలో గైడ్‌ చేయండి.. మేమేం వద్దనటం లేదు కదా! ఒక పాలసీ కార్యక్రమంలో పాలుపంచుకోవచ్చు. ఢిల్లీలో మా పార్టీ కార్యాలయానికి సెప్టెంబర్‌ 2న భూమి పూజ ఉంటుంది. తరువాత ఏమి జరుగుతదో మాకేం తెలు సు.. మీకే తెలుసు అని తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో  మంత్రి కేటీఆర్‌ అన్నారు.

ఈ సమాశంలో పార్టీ సెక్రటరీ జనరల్‌ కే కేశవరావు, ప్రధాన కార్యదర్శులు , కార్యదర్శులు సత్యవతి రాథో డ్‌, రాములు, బడుగుల లింగయ్యయాదవ్‌, మాలో తు కవిత, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, గ్యాదరి బాలమల్లు, తక్కళ్లపల్లి రవీందర్‌రావు, బోడకుంటి వెంకటేశ్వర్లు, భరత్‌కుమార్‌, వీజీ గౌడ్‌, బస్వరాజు సారయ్య, శంభీపూర్‌రాజు, తాడూరి శ్రీనివాస్‌, ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌రెడ్డి, నారదాసు లక్ష్మణ్‌రావు, బండి రమేశ్‌, ఫరూక్‌ హుస్సేన్‌, ఫరీదుద్దీన్‌, ఇంతియాజ్‌ ఇసాక్‌, రాధాకృష్ణశర్మ, మెట్టు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.