Home / SLIDER / ఏ ఎన్నికైన టీఆర్‌ఎస్‌దే బ్రహ్మాండ విజయం – మంత్రి కేటీఆర్

ఏ ఎన్నికైన టీఆర్‌ఎస్‌దే బ్రహ్మాండ విజయం – మంత్రి కేటీఆర్

టీఆర్‌ఎస్‌ పుట్టాక, రాష్ట్రం ఏర్పడ్డాక ఎన్నో ఎన్నికలను ఎదుర్కొన్నాం. అందులో హుజూరాబాద్‌ కూడా ఒకటి. అంతేతప్ప మరోటి కాదు. దాదాపు రెండున్నర గంటలపాటు జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్‌ వ్యూహంపై సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారే తప్ప.. హుజూరాబాద్‌ అనేపేరు ప్రస్తావించలేదు. హుజూరాబాద్‌ ఉపఎన్నిక తేదీ వస్తే దాని ప్రస్తావన వస్తది.

అప్పుడు పార్టీ చర్చిస్తది. అంతకుముందే పత్రికల్లో రాసినా.. టీవీల్లో చర్చించినా అదొక భ్రమ మాత్రమే. హుజూరాబాద్‌ మాకు చాలా చిన్న విషయం. మిగతా వాళ్ల మనస్సు దానిచుట్టే పరిభ్రమిస్తున్నది. మాకు ప్రజలకు సంబంధించి అనేక పనులున్నాయి. పనిచేసే ప్రభుత్వానికి.. పనిచేసే నాయకుడికి.. పనిచేసే పార్టీకి ప్రజలు తప్పకుండా అండగా నిలబడతారు.

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీఆర్‌ఎస్‌ బ్రహ్మాండమైన విజయాన్ని సొంతం చేసుకుంటుంది. హుజూరాబాద్‌ మొదటి నుంచి టీఆర్‌ఎస్‌ కంచుకోట. 2001లోనే పార్టీ పుట్టిన వెంటనే వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీలు, జడ్పీటీసీలను గెలుచుకున్నాం. ఈటల రాజేందర్‌ టీఆర్‌ఎస్‌లో 2003లో చేరారు. అప్పుటికే కమలాపూర్‌ (ఇప్పుడు హుజూరాబాద్‌) నియోజకవర్గం టీఆర్‌ఎస్‌కు బలమైన అడ్డ అని మంత్రి కేటీఆర్ అన్నారు.