Home / MOVIES / పవన్ అభిమానులకు శుభవార్త

పవన్ అభిమానులకు శుభవార్త

ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల‌లోకి రీ ఎంట్రీ ఇచ్చాడ‌ని తెలిసి అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. వ‌కీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన ప‌వ‌న్ ప్ర‌స్తుతం అయ్య‌ప్ప‌నుమ్ కోషియ‌మ్ రీమేక్‌ చిత్రంతో బిజీగా ఉన్నారు. భీమ్లా నాయ‌క్ అనే టైటిల్‌తో ఈ చిత్రం రూపొందుతుండ‌గా, ఇందులో ప‌వ‌న్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నున్నారు.

ప‌వ‌న్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆయ‌న సినిమాల‌కు సంబంధించిన క్రేజీ అప్‌డేట్స్ వ‌చ్చిన విష‌యం తెలిసిందే.భీమ్లా నాయ‌క్ నుండి సాంగ్ విడుద‌ల చేయ‌గా, హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా రిలీజ్ డేట్ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. ఇక సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా ఉంటుంద‌ని తెలియ‌జేశారు.ఇక హ‌రీష్ శంక‌ర్ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు.

హ‌రీష్ శంక‌ర్-ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాపై అభిమానుల‌లో భారీ అంచ‌నాలు ఉండ‌గా, ఇది దేశ భ‌క్తి నేప‌థ్యంలో రూపొందుతున్న‌ట్టు తెలుస్తుంది. ఈ సినిమాకి భ‌గ‌త్ సింగ్ అనే టైటిల్ ఫిక్స్ చేయ‌నున్నార‌ని తెలుస్తుంది. సినిమా క‌థ‌కి టైటిల్‌కి స‌రిగ్గా స‌రిపోతుంద‌ని మేక‌ర్స్ ఈ టైటిల్ ఫైన‌ల్ చేసిన‌ట్టు తెలుస్తుంది. ఇందులో పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.