విద్యుదుత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నదని టీఎస్ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్‌లోని కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ (కేటీపీపీ)లో ఉద్యోగుల కోసం నిర్మించిన 430 క్వార్టర్ల సముదాయం, ఏసీహెచ్‌పీ కెమికల్ ల్యాబ్ బిల్డింగ్‌ను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో కలిసి మంగళవారం ఆయన ప్రారంభించారు.
అనంతరం కేటీపీపీలోని పలు విభాగాలను సందర్శించి, అక్కడ జరుగుతున్న పనులను సీఎండీ పరిశీలించారు. సర్వీస్ భవన్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్లాంట్లలో బొగ్గు నిల్వ లపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా ప్రభాకర్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ మేరకు అంతరాయం లేకుండా ఉత్పత్తి చేయాలని సూచించారు. ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ.. దేశంలో ఒక్క తెలంగాణ ప్రభుత్వమే నిరంతర విద్యుత్తును అందిస్తున్నదన్నారు. అందుకు అనుగుణంగా టీఎస్ జెన్‌కో కృషి చేయాలని సూచించారు.