Home / SLIDER / పంపిణీకి సిద్ధ‌మ‌వుతున్న బ‌తుక‌మ్మ చీర‌లు

పంపిణీకి సిద్ధ‌మ‌వుతున్న బ‌తుక‌మ్మ చీర‌లు

బ‌తుక‌మ్మ పండుగ సంద‌ర్భంగా ఆడ‌బిడ్డ‌లకు తెలంగాణ ప్ర‌భుత్వం కానుక‌గా ఇస్తున్న బ‌తుక‌మ్మ చీర‌లు పంపిణీకి సిద్ధ‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టికే త‌యారీ పూర్త‌యిన బ‌తుక‌మ్మ చీర‌ల ప్యాకింగ్ కూడా మొద‌లుపెట్టారు.

హైద‌రాబాద్‌లోని చంద్రయాణ‌గుట్ట‌లోని టెస్కో గోడౌన్ల‌లో ఈ ప్ర‌క్రియ‌ చ‌క‌చ‌కా న‌డుస్తోంది. బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏటా అర్హులైన మహిళలందరికీ ఉచితంగా చీరలు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా ఈసారి రూ.333 కోట్లు కేటాయించి టెస్కో ఆధ్వర్యంలో కోటి చీరలను తయారు చేయించేందుకు మూడు జిల్లాల్లోని పవర్‌లూమ్స్‌కు ఆర్డర్‌ ఇచ్చింది. దీంతో సిరిసిల్లలోని పవర్‌లూమ్స్‌పై 75 లక్షలు, వరంగల్‌లో 13 లక్షలు, కరీంనగర్‌లో 12 లక్షల చీరలు తయారు చేశారు. ఈ సారి 17 రంగులు, 15 డిజైన్లలో తయారైన ఈ చీరల‌ను ప‌లు జిల్లాల‌కు త‌ర‌లించి గోదాముల్లో కూడా భ‌ద్ర‌ప‌రిచారు.