Home / MOVIES / Samantha అంత‌ Remunation తీసుకుంటుందా?

Samantha అంత‌ Remunation తీసుకుంటుందా?

 తెలుగు ఇండస్ట్రీలో సమంతకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె అక్కినేని కోడలు అయిన తర్వాత అది మరింత పెరిగింది. ఆ ఇమేజ్ కాస్త‌ అభిమానుల్లో గౌరవంగా మారింది. అందుకే పెళ్లి తర్వాత ఆమెకు ఎక్కువగా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలే వచ్చాయి. అంతకు ముందు బాగా గ్లామర్ క్యారెక్టర్స్ చేసినా కూడా.. పెళ్లి తర్వాత మాత్రం ఎక్కువగా నటనకు స్కోప్ ఉన్న క్యారెక్టర్ చేసింది.

దాంతో పాటు గ్లామర్ క్యారెక్టర్స్ కూడా చేసింది సమంత. ఫ్యామిలీమ్యాన్ 2 లో ఈమె చేసిన బెడ్ రూమ్ సీన్స్ సంచలనం సృష్టించాయి. నాగ చైతన్యతో విడాకులకు ఇది కూడా ఒక ప్రధాన కారణమని తెలుస్తోంది. తనకు కండిషన్స్ పెట్టినా.. ఒక పరిధి వరకు పరిమితం చేయడానికి ప్రయత్నించినా కూడా నచ్చదనే కారణంతోనే.. సమంత విడాకుల వరకు వచ్చిందని ప్రచారం జరుగుతోంది.ఇదిలా ఉంటే ఇలా విడాకులు తీసుకున్న తరువాత కూడా డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు. ఈమెతో సినిమాలు చేయడానికి నిర్మాతలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.

అంతేకాదు ఈమె తన తర్వాత సినిమా కోసం ఎవరూ ఊహించని స్థాయిలో సమంత రెమ్యునరేషన్‌ అందుకుంటుంది. ఇప్పటి వరకు తెలుగులో మరో హీరోయిన్‌కు కూడా సాధ్యం కాని స్థాయిలో 3.5 కోట్ల రెమ్యునరేషన్ సమంత అందుకోబోతుందని ప్రచారం జరుగుతోంది. సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించబోయే ఈ సినిమాను ఒక కొత్త దర్శకుడు తెరకెక్కించబోతున్నాడు. లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌తో వస్తున్న ఈ సినిమా కోసం ఏకంగా 3.5 కోట్ల పారితోషకం అందుకుంటుందని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది.