Home / LIFE STYLE / దసరా సందర్భంగా ప్రత్యేక రైళ్లు

దసరా సందర్భంగా ప్రత్యేక రైళ్లు

దసరా పండుగ సందర్భంగా దక్షిణ మద్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతున్నది. సికింద్రాబాద్‌ నుంచి నర్సాపూర్‌, కాకినాడకు నాలుగు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్‌-నర్సాపూర్‌ స్పెషల్‌ ట్రెయిన్‌ (07456) ఈ నెల 14న రాత్రి 10.55 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయల్దేరుతుందని, మరుసటి రోజు ఉదయం 10 గంటలకు నర్సాపూర్‌ చేరుతుందని తెలిపారు.

నర్సాపూర్‌-సికింద్రాబాద్‌ స్పెషల్‌ (07455) ఈ నెల 17న సాయంత్రం 6 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 4.10 గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుందన్నారు.

ఇక సికింద్రాబాద్‌-కాకినాడ టౌన్‌ స్పెషల్‌ (07053) ఈ నెల 14న రాత్రి 8 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు కాకినాడ టౌన్‌ చేరుతుందని, కాకినాడ టౌన్‌-సికింద్రాబాద్‌ స్పెషల్‌ (07054) ఈ నెల 17న రాత్రి 8.45 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.25 గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుందని అధికారులు వెల్లడించారు.