Home / MOVIES / రకుల్ ప్రీత్ సింగ్ జైలుకెళ్ళే అవకాశం. ఎందుకంటే..?

రకుల్ ప్రీత్ సింగ్ జైలుకెళ్ళే అవకాశం. ఎందుకంటే..?

టాలీవుడ్ లో పెళ్లి బాజాలు పరంపర కొనసాగుతూనే ఉండగా విడాకుల లిస్ట్ కూడా పెరిగిపోతుంది. అమల పాల్, శృతి హాసన్ వంటి హీరోయిన్స్ తమ పెళ్లిళ్లు పెటాకులు చేసుకోగా.. తాజాగా సమంత విడాకుల అంశం అయితే టాలీవడ్ లో సంచలనం రేపింది. ఈ తరుణంలో మరో స్టార్ హీరోయిన్ పెళ్లి కూడా క్యాన్సిల్ అవ్వనున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం మొదలైపోయింది.

ప్రముఖ జ్యోతిష్యులు ఈ అంశాన్ని ద్రువీకరిస్తున్నారు. బాలీవుడ్ యంగ్ హీరో జాకీ భగ్నానీతో త్వరలో తన వివాహం జరగనున్నట్టు అధికారిక ప్రకటన చేసింది గ్లామర్ క్వీన్ రకుల్ ప్రీత్ సింగ్. తనకి కాబోయే భర్త జాకీ భగ్నానీ చేతిలో చెయ్యి వేస్తూ నడుస్తున్న ఫోటోని షేర్ చేస్తూ ”లవ్ ఆఫ్ మై లైఫ్” అంటూ రకుల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టి అప్పట్లో అందరికి షాక్ ఇచ్చింది.

అయితే ఎప్పటినుండో ఈ హీరోయిన్ పై డ్రగ్స్ వివాదం కూడా కొనసాగుతుంది. తన చుట్టూ డ్రగ్స్ ఉచ్చు బిగుస్తున్న నేపథ్యంలోనే రకుల్ వివాహ ప్రకటన వచ్చింది. అయితే అప్పుడు ఎలాంటి రూమర్స్ పుట్టలేదు. కానీ తాజాగా వేణు స్వామి అనే ప్రముఖ ఆస్ట్రాలజర్ రకుల్ వివాహంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. రకుల్ పెళ్లి జ‌రిగినా కూడా వీరిద్ద‌రు క‌లిసి ఉండ‌ర‌ని.. సంతానం కలగకపోవడం సహా న్యాయ పరమైన ఇబ్బందులు కూడా వస్తాయని జ్యోతిష్యుడు వేణుస్వామి వెల్లడించాడు.