అపజయం అనేది లేకుండా వరుస సినిమాలతో దూసుకెళుతున్న దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli). తెలుగు సినిమా స్థాయిని పెంచిన ఆయన ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్ర ప్రమోషనల్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సినిమా విశేషాలతో పాటు పర్సనల్ లైఫ్‌కి సంబంధించి కూడా కొన్నిఆసక్తికర విషయాలు తెలియజేస్తున్నారు. ఓ విద్యాసంస్థలో జరిగిన ఈవెంట్‌లో కొన్నాళ్లు నా భార్య సంపాదన మీద ఆధారపడి బ్రతికానని చెప్పాడు.
ఒక టైమ్‌లో తనకు పైసా సంపాదన లేదు. నా భార్య జీతం మీద బతికాను. అలా చెప్పుకోవడానికి సిగ్గేయడం లేదని సంతోషంగా ఉందని చెప్పాడు. తాను దర్శకుడు కాకముందు తన పనల్లా పొద్దున్నే భార్య రమా(Rama)ను ఆఫీస్‌లో డ్రాప్ చేసి కధలు, డైలాగ్స్ రాసుకోవడం, మళ్ళీ సాయంత్రం ఇంటికి తీసుకు రావడం అని ఇది మా లవ్‌స్టోరీ అని జక్కన్న తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
ఫ్యూచర్‌లో ఫ్లాపులు వచ్చి సినిమాలు లేకపోతే ఆమెని జాబ్‌కి పంపిస్తా అని అన్నాడు రాజమౌళి. నిజమైన ప్రేమ నా భార్యను చూసిన తరువాతే కలిగింది అని రాజమౌళి చెప్పుకొచ్చారు.