Home / MOVIES / రజనీకాంత్ – శివ కాంబినేషన్‌లో మరో మూవీ

రజనీకాంత్ – శివ కాంబినేషన్‌లో మరో మూవీ

సూపర్ స్టార్ రజినీకాంత్ దీపావళి పండుగ సందర్బంగా ‘అణ్ణాత్త’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగులోనూ ఈ చిత్రం ‘పెద్దన్న’గా రిలీజైంది. ఈ మూవీకి మాస్ చిత్రాల దర్శకుడు శివ దర్శకత్వం వహించాడు. భారీ అంచనల మధ్య విడుదైలన ‘అణ్ణాత్త’ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది.

అయితే, తాజా సమాచారం ప్రకారం రజనీకాంత్ – శివ కాంబినేషన్‌లో మరో మూవీకి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. శివ దర్శకత్వంలో అజిత్ చేసిన సినిమాలు మంచి మాస్ హిట్స్‌గా నిలిచాయి.

దాంతో దర్శకుడిగా తెలుగులో కెరీర్ ప్రారంభించినప్పటికీ, కోలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే రజనీతో ‘అణ్ణాత్త’ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం అందుకున్నాడు శివ. ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోకపోయినప్పటికీ మరోసారి సూపర్ స్టార్‌ను డైరెక్ట్ చేసే అవకాశం దక్కినట్టు సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే అఫీషియల్ కన్‌ఫర్మేషన్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino